- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 3.2 కోట్లకు అమ్ముడు పోయిన 'పోకెమాన్' కార్డ్!
దిశ, ఫీచర్స్ : 'పోకెమాన్' గేమ్ అనేక జనరేషన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఏదో ఒకరోజు విలువైనవిగా మారతాయని చెబితే అందరూ నవ్వుకునేవారు. ఇదిలా ఉంటే దశాబ్దాలు గడుస్తున్నా పోకెమాన్ క్రేజ్ తగ్గకపోగా.. ప్రస్తుతం ఆ కార్డ్ సెట్స్ రికార్డ్ ధరలకు అమ్ముడుపోతూ అప్పటి మాటలను నిజం చేస్తున్నాయి. రీసెంట్‌గా అరుదైన పోకెమాన్ కార్డ్ ఒకటి రూ. 3.2 కోట్లకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరిచింది.
'90వ దశకంలో కార్డ్స్ సేకరించిన పోకెమాన్ గేమ్ ప్రియులకు శుభవార్త. కొన్నేళ్ల కిందటి అరుదైన కార్డ్స్‌కు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు అత్యధిక మొత్తాలకు అమ్ముడుపోతున్నాయి' అని USA టుడే ఇటీవలే పేర్కొంది. ఈ క్రమంలోనే ఆర్టిస్ట్ మిత్స్ హిరో అరిటా 1999లో రూపొందించిన 1వ ఎడిషన్ బేస్ సెట్ చారిజార్డ్ పోకెమాన్ కార్డ్.. వేలంలో భారీ ధరకు విక్రయించబడింది. అమెరికాకు చెందిన లార్జెస్ట్ ట్రేడింగ్ కార్డ్ మార్కెట్‌ప్లేస్ PWCC ప్రీమియర్ అక్షన్‌లో రూ. 3.2 కోట్లకు( $4,20,000) అమ్ముడుపోయిన మొదటి కార్డ్‌గా రికార్డ్ సృష్టించింది.
ప్రపంచంలోని హోలీ గ్రెయిల్స్‌గా పరిగణించే ఈ కార్డ్.. PSA 10 జెమ్ మింట్ గ్రేడింగ్‌ను పొందింది. మార్చి ఫస్ట్ వీక్‌లో జరిగిన వేలంలో అరుదైన మొదటి ఎడిషన్ చారిజార్డ్ నంబర్ 4 కార్డ్ $3,36,000కి విక్రయించబడింది. కాగా అన్ని సమయాల్లో అత్యధిక వసూళ్లు చేసిన మీడియా ఫ్రాంచైజీగా పోకెమాన్ టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు స్టాటిస్టా పేర్కొంది. హలో కిట్టి, స్టార్ వార్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజీలు ఇప్పటి వరకు $68.7 బిలియన్లు, $35.3 బిలియన్ల ఆదాయాన్ని పొందగా.. పోకెమాన్ $105 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది.