- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు ‘SSMB-29’ మూవీపై రాజమౌళి ఆసక్తికర పోస్ట్..
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి కాంబోలో ‘SSMB29’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి(Rajamouli) సినిమా కోసం ఫుల్‌గా జుట్టు, గడ్డం పెంచేసి తన లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. అయితే ‘SSMB-29’ పనులు స్టార్ట్ అయి చాలా రోజులు అవుతున్నప్పటికీ అప్డేట్స్ మాత్రం రాలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, రాజమౌళి(Rajamouli) ‘SSMB-29’ షూటింగ్ కోసం ప్లేస్ వెతుకుతున్నట్లు ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. కెన్యా(Kenya)లోని ఓ అడవి ప్రాంతంలో జంతువుల మధ్య తిరుగుతున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రజెంట్ రాజమౌళి(Rajamouli) పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.