రేర్ పిక్.. నాగార్జున స్మోకింగ్ స్టైల్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటో

by Kavitha |   ( Updated:2025-04-14 12:25:18.0  )
రేర్ పిక్.. నాగార్జున స్మోకింగ్ స్టైల్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున(Nagarjuna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మన్మధుడు అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు. ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి ఫ్యామిలీ స్టార్ హీరో అనిపించుకున్నాడు.

65 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ‘కుబేర’ మూవీలో నటిస్తున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దగ్గుబాటి వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విడాకులు తీసుకుని హీరోయిన్ అమలను మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక అమలకు అఖిల్ జన్మించగా.. లక్ష్మీకి నాగ చైతన్య పుట్టాడు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నాగార్జునకు సంబంధించిన ఓ రేర్ పిక్ హల్‌చల్ చేస్తుంది. కింగ్ నాగార్జున స్మోకింగ్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ పిక్ ఇప్పటిది కాదు. ఇక ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ(Balakrishna), నాగార్జున, రాజా రవీంద్ర(Raja Ravindra) వంటి యాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు నాగార్జున స్మోకింగ్ స్టైలే వేరబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed