- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips: ఆయుర్దాయాన్ని పెంచే.. లైఫ్ హ్యాబిట్స్!
దిశ, ఫీచర్స్ : హడావిడి జీవితాల్లో.. ఇన్‌స్టంట్ ఫుడ్‌కు అలవాటైన జీవనచిత్రంలో.. కాస్త ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తలనొప్పి వస్తే ఓ టాబ్లెట్, జ్వరం వస్తే ఓ ఇంజెక్షన్, ఆ తర్వాత మళ్లీ పరుగు పందానికి సిద్ధం.. ఇదే జీవితమైపోతున్న వేళ ఎవరు ఎంతకాలం జీవిస్తారో ఊహించడం కష్టం గా మారిపోయింది. ఇలాంటి తరుణంలో జీవనశైలితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆయుష్షును పెంచుకోవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అమీ షా.. జీవన ప్రమాణాన్ని పెంచుకునేందుకు సాయపడే కొన్ని చిట్కాలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పొందుపరిచారు. ఆ చిట్కాల గురించి మీకోసం.
రోజువారీ ఆహారంలో పప్పుధాన్యాలు, తృణధాన్యాలు సహా చిక్కుళ్లను చేర్చుకోవాలని అమీ షా సూచించింది. పోషక మయమైన ఈ ఆహారాలను స్వీకరించడం వల్ల అంతర్గత అవయవాలు బాగా పని చేయడమే కాక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి ఆయు:ప్రమాణాన్ని పెంచడంలో దోహదపడతాయి.
మాంసం తగ్గించండి :
రెడ్ మీట్ సహా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడమే ఉత్తమం. ఇందులో ఉండే శాచ్యురేటెడ్ కొవ్వు వల్ల గుండె ఆర్టరీలు బ్లాక్ అయిపోయి గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు కేలరీలు అధికంగా ఉండే రెడ్ మీట్‌ను ఎక్కువగా తింటే ఊబకాయం తప్పనిసరి. ఇక తరుచుగా తీసుకోవడం వల్ల జీవిత కాలం కూడా తగ్గుతుందని ఓ పరిశోధన పేర్కొంది. ఈ క్రమంలోనే శాకాహారంతో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు దూరంగా ఉంచుతుందని చెప్తున్నారు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యూకే, ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్ చేసిన అధ్యయనంలో మాంసాహారులకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని వెల్లడైంది. శాఖాహారంతోనే ఆయుర్దాయం పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
విటమిన్ డి:
సూర్యరశ్మి నుంచి పొందే 'విటమిన్ డి' వల్ల శరీరానికి ఎంతో మేలు. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సాయపడుతుంది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్ పరిమాణాన్ని నియంత్రించేందుకు, ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఈ విటమిన్ అవసరమవుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాసేపు సూర్యరశ్మిలో కూర్చుంటే ఈ విటమిన్‌ను పుష్కలంగా పొందవచ్చు.
13 అవర్స్ డైట్ :
రాత్రిపూట 13 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల శరీరం జీర్ణక్రియపై కాకుండా అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఇస్తుంది. ప్రకృతి వలె శరీరం కూడా దానికదే రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియకు విశ్రాంతి కల్పించడం ద్వారా దాని విధులను మెరుగ్గా నిర్వర్తిస్తుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్యాన్ని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా ఆయువును పెంచేందుకు దోహదపడుతుంది.
రోజుకు పదివేలు :
నిత్యం చురుకుగా, చలాకీగా ఉండటం వల్ల శరీరం మరింత దూకుడుగా పనిచేస్తుంది. ఇందుకోసం జిమ్ లేదా ఇతర తీవ్రమైన వర్కవుట్స్ చేయకపోయినా రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల కూడా ఫిట్‌గా ఉండొచ్చు. ఉదయం నడక మానసిక ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుండగా.. ఒత్తిడి, ఆందోళన నివారించడానికి కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు సూచించాయి. నడక మెదడుకు రక్త సరఫరాను పెంచుతుందని, కాలక్రమేణా జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రభావాలను తగ్గించడానికి ఇలాంటి మిత వ్యాయామం సాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఒత్తిడి జయిద్దాం :
ఒత్తిడికి సంబంధించిన వ్యక్తిగత, వృత్తిపరమైన సంఘటనలు మీ ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. ఒత్తిడిని తగ్గించేందుకు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రకృతిలో నడవడం లేదా ధ్యానం చేయడం వంటివి ఎంచుకోవచ్చు. మ్యూజిక్ వినడం, పెయింటింగ్ వేయడం, కవితలు రాయడం, గార్డెనింగ్, కుకింగ్ వంటి ఇష్టమైన పనులు చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ కలిగి మిమ్మల్ని మీరు రీచార్జ్ చేసుకోగలుగుతారు. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి.