- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ పని దినాలు.. వారానికి నాలుగు రోజులే!
దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది సోమవారాన్ని వీకెండ్ హ్యాంగోవర్‌తో లేదా తదుపరి లీవ్ ఎప్పుడొస్తుందా..! అనే ప్రణాళికలతో ప్రారంభిస్తారు. మండే టు ఫ్రైడే పనిచేసే వ్యక్తులు వారంలోని మూడో రోజు నాటికి పనిపై శ్రద్ధ, ఆసక్తి తో పాటు తమలోని శక్తిని కూడా కోల్పోతారు. ఈ మూడ్ స్వింగ్స్ ఉత్పాదకత పైన ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని సంస్థలు.. నాలుగు రోజుల పనిదినాలను అమలు చేస్తూ ఎంప్లాయిస్‌లో ఆనందాన్ని, వర్క్‌లైఫ్‌లో క్వాలిటీని పెంచుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'ఫోర్ డే- వర్క్ వీక్' పద్ధతికి మద్దతు పెరుగుతోంది. బెల్జియం ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుండగా.. మరికొన్ని దేశాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి.
స్పెయిన్ :
స్పానిష్ ప్రభుత్వం ట్రయల్ బేసిస్‌పై 'ఫోర్ డేస్ వర్క్ వీక్'తో ప్రయోగాలు చేస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. కార్మికుల పరిహారాన్ని తగ్గించకుండా, మూడేళ్లలో 32 గంటల పని వారానికి అంగీకరించింది.
ఐస్‌లాండ్ :
2015 నుంచి 2019 వరకు.. తక్కువ పని వారాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్‌ను నిర్వహించిన దేశం ఐస్‌లాండ్. దీని ప్రకారం ఉద్యోగులందరూ ఉత్సాహంగా పని చేసి ఉత్పాదకతను పెంచడంలో కీ రోల్ పోషించినట్లు తేలింది. ఈ విషయంలో 2,500 మంది కార్మికులపై చేపట్టిన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని నిరూపించింది. ప్రీస్కూల్స్, కార్యాలయాలు, సామాజిక సేవా ప్రదాతలు, ఆస్పత్రులు సహా వివిధ రకాల కార్యాలయాల శ్రేణిలో ఈ ట్రయల్స్ నిర్వహించారు.
స్కాట్లాండ్ :
ఐస్‌లాండ్‌లో నాలుగు-రోజుల పని వారం విజయవంతమైన తర్వాత స్కాట్లాండ్ కూడా ఈ కొత్త జాబితాలో చేరింది. థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్(IPPR) పరిశోధన ఆధారంగా.. జీతం కోల్పోకుండా పనిదినాలను తగ్గించడం వల్ల శ్రేయస్సు పై సానుకూల ప్రభావం చూపుతుందని 80 శాతం ప్రజలు భావించారు.
ఐర్లాండ్ :
ఐర్లాండ్ కూడా తన పైలట్ ప్రోగ్రామ్‌ను ఈ ఏడాదే ప్రారంభించింది. జనవరి 2022లో ప్రారంభమైన ట్రయల్‌కు సంబంధించి వారంలో నాలుగు రోజుల పాటు ఎలా పని చేయాలనే విషయంపై సంస్థలు మద్దతు, శిక్షణ, మార్గదర్శకత్వం పొందుతాయి. ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రభావాలను అంచనా వేసేందుకు ఐరిష్ ప్రభుత్వం పరిశోధనకు నిధులు సమకూరుస్తుంది. నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 17 కంపెనీలు ఈ ప్రోగ్రామ్ కోసం సైన్‌అప్ చేశాయి.
న్యూజిలాండ్ :
'ఫోర్ డే వర్క్ వీక్' ఎంపికలను పరిగణించాలని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్.. దేశీయ కంపెనీలకు రెండేళ్ల కిందటే సూచించారు. 2018 నుంచి పెర్పెచువల్ గార్డియన్ కంపెనీ సిబ్బందికి వారానికి నాలుగు రోజులు పనిదినాలు అమలు చేయగా, ఆరు వారాల ట్రయల్‌లో ఉత్పాదకత 20 శాతం మెరుగుపడిందని తేలింది.
జపాన్ :
ఎప్పుడూ పని సామర్థ్యం, నాణ్యత గురించి మాట్లాడే జపాన్ మాత్రం మొదట్లో ఈ 'ఫోర్ డే వర్క్ వీక్' కు మొగ్గు చూపలేదు. అయితే పని-జీవిత సమతుల్యతను మెరుగుపరిచే లక్ష్యానికి అనుగుణంగా ఈ పద్ధతిని ప్రారంభించాలని జపాన్ ప్రభుత్వం జూన్ 2021 లో పలు కంపెనీలను కోరింది.