టీకా వికటించి పసికందు మృతి

by Johnkora |
టీకా వికటించి పసికందు మృతి
X

దిశ, పెద్దపల్లి: టీకా వికటించి రెండు నెలల పసికందు మరణించిన సంఘటన పెద్దపల్లి లో చోటు చేసుకుంది. మండలంలోని కాపులపల్లి గ్రామంలో మేదర వేణి మహేష్ రజిత ల రెండు నెలల పసికందు టీకా తీసుకోవాలి, బుధవారం రోజున ఏఎన్ఎం ఫోన్ చేశారు. కాగా కనగర్తి లో టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకొని ఇంటికి తిరిగి వచ్చామని.. అదే రోజు రాత్రి బాబుకు జ్వరం రావడంతో సిరప్ పోయడం జరిగిందని.. ఉదయం బాబు నిద్రలో నుంచి లేవకుండా ఉండేసరికి తల్లి బాబును నిద్ర నుంచి లేపే ప్రయత్నంలో చర్మమంతా చల్లబడి ఉండడం గమనించి భయాందోళనకు గురై కుటుంబ సభ్యులు హుటాహుటిన పెద్దపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పసికందు మరణించినట్టుగా నిర్ధారించడం తో కాపులపల్లె లో ఒక్కసారిగా విషాద ఛాయాలు చోటుచేసుకున్నాయి. పసికందు మృతి కి కనగర్తి ఏఎన్ఎం, వైద్య సిబ్బంది కారణం అంటూ.. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed