- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూరింగ్ కోసం ఉపయోగపడే కొత్త బైక్ ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660
దిశ,వెబ్‌డెస్క్: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన సరికొత్త టైగర్ స్పోర్ట్ 660 ADV బైక్‌ని ఇండియాలో లాంచ్ చేయనుంది. కంపెనీ మోటార్‌సైకిల్‌ను మార్చి 29న విడుదల చేయాలని ప్లాన్ చేసింది. దానిని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు మోటార్‌సైకిల్‌ను ముందస్తుగా కూడా బుక్ చేసుకోవచ్చు. కొత్త బైక్ 660cc త్రీ-సిలిండర్ ఇంజన్ ద్వారా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 81 PS @ 10,250rpm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మోటార్‌సైకిల్ ఉత్పత్తి చేసే గరిష్ట టార్క్ 64Nm @ 6,250rpm. ఇంజన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సస్పెన్షన్ పరంగా 41mm USD ఫోర్క్స్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ఉంది. మోటార్‌సైకిల్‌లో TFT డిస్‌ప్లేను అమర్చారు. ABS, బ్లూటూత్, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, పూర్తి LED లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. 17-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. టూరింగ్ సమయంలో ఈ బైక్ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.8.50 లక్షలు.