తెలంగాణ జనసమితి ప్లీనరీని విజయవంతం చేద్దాం

by Nagaya |
తెలంగాణ జనసమితి ప్లీనరీని విజయవంతం చేద్దాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జన సమితి పార్టీ రెండవ ప్లీనరీని విజయవంతం చేసి, తెలంగాణ దిక్సూచి అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వాన్ని బలపర్చాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్, రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి నరేందర్‌లు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం గన్ పార్కు వద్ద ప్లీనరీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. సంగారెడ్డి లో మార్చి 6న జరిగే రెండవ ప్లీనరీ సమావేశానికి కార్మికులు, విద్యార్థులు, యువత మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రమేష్, సురేష్, చందు, కరుణాకర్, సాయి, దివాకర్, ఉపేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed