వలసవాద ఓటమికి సంబంధించిన గొప్ప భారతీయ చిత్రం.. ఎంతో తెలుసా?

by Manoj |
వలసవాద ఓటమికి సంబంధించిన గొప్ప భారతీయ చిత్రం.. ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుర్కొని భారీ విజయాన్ని సాధించిన వ్యక్తి టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ తన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక పెద్ద పెయింటింగ్‌ను వేయించాడు. అయితే తాజాగా లండన్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో ఈ పెయింటింగ్ భారీ ధరకు అమ్ముడు పోయింది. వివరాల్లోకి వెళితే.. 1780లో ఈస్టిండియా కంపెనీపై మైసూర్ పాలకుడు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు.

ఆ విజయాన్ని వర్ణించే పెయింటింగ్ బుధవారం లండన్‌లో £630,000 (₹6.2 కోట్లు)పౌండ్లకు విక్రయించబడింది. "నేటి ఆర్ట్స్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ & ఇండియా వేలంలో ఇప్పటివరకు అగ్రగామిగా ఉంది. టిప్పు సుల్తాన్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వర్ణించే ఈ పెయింటింగ్ 32 అడుగుల పొడవుతో విస్తరించింది. ఇది అద్వితీయమైన పొల్లిలూర్ యుద్ధ దృశ్యం" అని సోథెబీస్ నిపుణుడు విలియం డాల్రింపుల్, 'ది అనార్కీ: ది రిలెంట్‌లెస్ రైజ్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ' రచయిత అన్నారు.

Advertisement

Next Story

Most Viewed