ఆ మార్కెట్ నిర్మాణానికి హైకోర్టు బ్రేక్.. అప్పటివరకు ఆపాలని ఆర్డర్!

by Satheesh |   ( Updated:2022-03-31 13:37:59.0  )
ఆ మార్కెట్ నిర్మాణానికి హైకోర్టు బ్రేక్.. అప్పటివరకు ఆపాలని ఆర్డర్!
X

దిశ, మెదక్: మెదక్ పట్టణంలో బాలుర హైస్కూల్, జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించదలిచిన కూరగాయలు, మాంసపు దుకాణాల (Veg & Nonveg) సంయుక్త మార్కెట్ నిర్మాణం అక్కడ చేపట్టవద్దని స్ధానిక సంస్థలు, పూర్వ విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. జిల్లా కలెక్టర్‌కు వివిధ సంఘాల నుండి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోగా కళాశాల ప్రాంగణంలో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి మల్కాజి సత్యనారాయణ ఉన్నత న్యాయస్థానాన్ని ప్రజాప్రయోజనాల వాజ్యం W.P. PIL NO.48 of 2022 ద్వారా హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ దాఖలు చేశారు. ఆ ప్రజాప్రయోజనాల వాజ్యం గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, న్యాయముర్తి అభినందన్ కుమార్ శావ్‌లు విచారణ చేపట్టారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కళాశాల ప్రాంగణంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, ఆ స్థలం కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఉండాలని, స్థలంలో ఎటువంటి మార్పులు చేయరాదని ఆదేశించారు. ఈ ప్రజా ప్రయోజనాల వాజ్యం పెండింగ్‌లో ఉన్నంత వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed