పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Hamsa |
పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరోయిన్ విద్యా ప్రదీప్(Vidya Pradeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు డాక్టర్ అయినప్పటికీ ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటనపై ఆసక్తితో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. గత ఏడాది ‘కన్నగి’(Kannagi) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక విద్యా ప్రదీప్(Vidya Pradeep) పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే మైకేల్(Michael) అనే ఫొటోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

ఇక అప్పటి నుంచి అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. ఇక విద్యా మాత్రం సినిమాల షూటింగ్‌ల కోసం ఇండియా వచ్చి వెళ్తుండేది. ఇదిలా ఉంటే.. తాజాగా, విద్యా ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా ఓ గుడ్ న్యూస్(good news) ప్రకటించింది. పెళ్లైన 13 ఏళ్లకు తాను తల్లి కాబోతున్నట్లు తెలుపుతూ బేబీ బంప్(baby bump) ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ఓ ఎమోషనల్ క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ విద్యా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed