RCB కెప్టెన్ రజత్ పాటిదార్ కు భారీ ఫైన్ !

by Veldandi saikiran |
RCB కెప్టెన్ రజత్ పాటిదార్ కు భారీ ఫైన్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌ కు ఊహించని షాక్ తగిలింది. రజత్ పాటిదార్‌ కు భారీ ఫైన్ వేసింది ఐపీఎల్ లీగ్ కౌన్సిల్ ( IPL League Council). ముంబై వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ నేపథ్యంలో... ఏకంగా 12 లక్షల భారీ ఫైన్ వేసింది. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ( Slow over rate ) కారణంగా జత్ పాటిదార్‌ పై ఈ ఫైన్ ( Penalty ) విధించింది ఐపీఎల్ లీగ్ కౌన్సిల్.

ఐపీఎల్ ప్రవర్తన నియామవళి ఆర్టికల్ 2.2 ప్రకారం... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ జత్ పాటిదార్‌ పై ఈ ఫైన్ విధించారు. ఇది ఇలా ఉండగా.. నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగానే... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే ముంబై రెండు జట్లు తలపడ్డాయి.

కానీ చివరికి... ముంబై గడ్డ పైన గెలుపు మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను వరించింది. ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కాగా ఈ మ్యాచ్ లో జత్ పాటిదార్‌ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 64 పరుగులు చేసిన జత్ పాటిదార్‌... నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు కొట్టాడు.

Next Story

Most Viewed