దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-08 05:26:53.0  )
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు(Dilsukhnagar Twin Blasts Case)లో హైకోర్టు(Telangana High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మొత్తం ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తుది తీర్పు చెప్పింది. కాగా, 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను నగర వాసులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్సులో బాంబులు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 131మందికి పైగా గాయపడ్డారు. కేసులో ఐదుగురు నిందితులకు NIA ప్రత్యేక కోర్టు 2016లోనే ఉరి శిక్ష విధించగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ(NIA Court) కోర్టు తీర్పును సమర్ధించి దోషులకు ఉరిశిక్ష విధించింది.

నిందితులు :

ఏ-1 గా అసదుల్లాహ అక్తర్.

ఏ-2 యాసిన్ భక్తల్.

ఏ-3 తహసిన్ అక్తర్.

ఏ-4 గా జియావుర్ రెహ్మాన్.

ఏ-5 గా ఎజాక్ షాయిక్.



Next Story

Most Viewed