పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి: సాయికుమార్

by GSrikanth |
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి: సాయికుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ ఫిషర్‌మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా తోపుడు బండ్లపై వాహనాలు పెట్టి ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, గతకొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం పెంచుకుంటూ పోతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా బస్సు ఛార్జీలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్య మధ్య తరగతి ప్రజలు వేయి రూపాయలు పెట్టి గ్యాస్ కొనే స్థితిలో లేరని అన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చక్రదారి, టీ చంద్రశేఖర్, ప్రదీప్ గౌడ్, నిమ్మ ప్రదీప్, మనోహర్, శంకర్ సింగ్, సాయి కృష్ణ, సందీప్, సంజయ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story