- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Yoga Pose: హార్మోన్ల బ్యాలెన్స్‌కు చెక్ పెట్టే బెస్ట్ ఆసనం..!

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత(Hormonal imbalance) ఏర్పడుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్ కరెక్ట్ లేకపోయినట్లైతే కనుక.. బాడీలో చాలా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో నిపుణులు చెప్పినవవి చూద్దాం.. ఏకాగ్రత(Concentration) కుదరకపోవడం, ఊరికే అలసట రావడం, విపరీతంగా చెమటలు పట్టడం(Sweating), ఫేస్‌పై పింపుల్స్(Pimples) రావడం, వేగంగా బరువు పెరగడం(Weight gain) లేదా తగ్గడం జరుగుతుంది.
తెలియకుండానే డిప్రెషన్(Depression)లోకి వెళ్లిపోవడం, మాసికంగా ఆందోళన, చెందడం, సంతాన సమస్యలు ఏర్పడడం, పీరియడ్స్(Periods) టైమ్‌కు రాకపోవడం, అధిక రక్తస్రావం(Excessive bleeding), అవాంఛిత రోమాలు(Unwanted hair),హెయిర్ ఉడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సుప్త బద్ద కోణాసనం(Supta Badda Konasana) చేస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటు తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఇదేలాగో ఇప్పుడు చూద్దాం..
ముందుగా నెలపై నిటారుగా పడుకుని.. రెండు మోకాళ్లను పక్కలకు మడిచి పాదాలను ఒకదానికి ఒకటి తాకించి ఉంచాలి. తర్వాత వాటిని బాడీవపు తీసుకోచ్చేలా ఒత్తిడి చేయాలి. అలాగే అరచేతులు పైకి ఉంచి.. బ్యాక్ తీసుకెళ్లి నేలకు తాకించాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇలా 10 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. ఈ ఆసనం వల్ల కేవలం హార్మోన్ల అసమతుల్యత మాత్రమే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. నాణ్యమైన నిద్రకు మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరుగుతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.