- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చనిపోతున్నానంటూ దోస్తులకు వాట్సాప్ మెసేజ్.. ఇంటికెళ్లి చూసే సరికి అంతా షాక్
దిశ, ముషీరాబాద్: జీవితంపై విరక్తి చెంది పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సీఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ డివిజన్ కృష్ణ నగర్ బస్తీకి చెందిన రాజేశ్వర్ తమ్ముని కుమారుడు పి. కావేష్(18) పదవ తరగతి చదువుతున్నాడు. కాగా కావేష్ తల్లిదండ్రులు 12 ఏళ్ల క్రితం టీబీ తో మృతి చెందారు. దీంతో కావేష్ పెద్దనాన్న రాజేశ్వర్ వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవితంపై విరక్తి చేందుతుండేవాడు.
ఈ క్రమంలో 12వ తేదీన రాత్రి భోజనం చేసి, జీవితంపై తనకి విరక్తి చెందిందని తను చనిపోతున్నానని స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం మెసేజ్ చూసుకున్న స్నేహితులు కావేష్ ఇంటికి పరిగెత్తి చూడగా సీలింగ్ కి వేలాడుతూ కనిపించాడు. బతికున్నడేమో అని అనుమానంతో హాస్పిటల్ కి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయాన్ని చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.