- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Taapsee Pannu: తాప్సీ ఆ పని చేసేందుకు పదేళ్లు పట్టింది.. ఒంటరి ప్రయాణంలో..

దిశ, సినిమా : టాలెంటెడ్ తాప్సీ(Taapsee Pannu).. ఫైనల్లీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించే చాన్స్ కొట్టేసింది. కింగ్ ఖాన్ లేటెస్ట్‌గా అనౌన్స్ చేసిన 'డంకీ'లో కీ రోల్ పోషిస్తున్నట్లు పోస్ట్ పెట్టింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై తను ఎమోషనల్‌గా రియాక్ట్ అయింది. 'అవును ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయాణించడం కష్టం. కానీ గట్టిగా కోరుకుంటే, దాన్ని పొందేందుకు విశ్వం మొత్తం మీకు సాయపడుతుందని ఒక సూపర్ స్టార్ చెప్పాడు. నిజాయితీ, కృషి, పట్టుదలతో సాగిన ఈ ప్రయాణంలో షారుఖ్‌తో స్క్రీన్ షేరింగ్‌కు దాదాపు పదేళ్లు పట్టింది. చివరకు 'ఆల్ ఈజ్ వెల్' అని చెప్పింది. మొదిటి డైలాగ్‌ను సూపర్ స్టార్ షారుఖ్ 'ఓం శాంతి ఓం' మూవీలో చెప్పగా.. 'ఆల్ ఈజ్ వెల్' అనేది రాజ్ కుమార్ హిరానీ 'త్రీ ఇడియట్స్' చిత్రంలోని డైలాగ్.
ఇక 'డంకీ' అంటే డంకీ ఫ్లైట్. వలసదారులు ఇల్లీగల్‌గా బ్యాక్ డోర్ నుంచి ఓ దేశానికి ఎంటర్ కావడాన్నే ఇలా పిలుస్తుంటారు. చట్టబద్ధంగా వెళ్లేందుకు అనుమతి లభించని పక్షంలో చాలామంది యువత ఇలాంటి దారినే ఎంచుకుంటున్నారని, ఈ స్టోరీ లైన్‌ను రాజ్ కుమార్ హిరానీ ఎమోషనల్ అండ్ ఫన్ ఫిల్లింగ్‌తో తెరకెక్కించనున్నారు.