- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IND vs BAN : షమీ, రోహిత్, కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా ఘనంగా మొదలుపెట్టింది. తొలి గ్రూపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలుకొట్టారు. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ వరల్డ్ రికార్డు సృష్టించాడు బంతుల పరంగా వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. షమీ మొత్తం 104 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. అతను 5,240 బంతుల్లో ఈ మైలురాయిని నెలకొల్పగా.. షమీ 5,126 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇక, మ్యాచ్‌ల పరంగా స్టార్క్(102) ముందున్నాడు. 104 మ్యాచ్‌లతో షమీ రెండో స్థానంలో ఉన్నాడు.
అలాగే, భారత్ తరపున వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అజిత్ అగార్కర్(133 ఇన్నింగ్స్‌లు)ను వెనక్కి నెట్టి షమీ 103 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరాడు. వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ నిలిచాడు. 60 వికెట్లతో జహీర్ ఖాన్(59) రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో జడేజా(2013లో 5/35) తర్వాత భారత్ తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ షమీ(5/53)నే.
మరోవైపు, శాంటో, జాకర్ అలీ ఇచ్చిన క్యాచ్‌లను అందుకోవడంతో విరాట్ కోహ్లీ కూడా ఓ అరుదైన ఘనత సాధించాడు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కోహ్లీ(156) నిలిచాడు. సచిన్(140), ద్రవిడ్(124), రైనా(102) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, రోహిత్ శర్మ వన్డేల్లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘతన సాధించాడు. దీంతో వేగంగా ఈ ఫీటు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. 222 ఇన్నింగ్స్‌లతో కోహ్లీ అతని కంటే ముందున్నాడు.