'పుష్ప' అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. 'పార్ట్ 3'కి ప్లాన్

by Manoj |
పుష్ప అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. పార్ట్ 3కి ప్లాన్
X

దిశ, సినిమా: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన దర్శకుడు సుకుమార్ ఇప్పటికే 'పుష్ప పార్ట్ 2' షూటింగ్ కోసం లొకేషన్స్ వెతికే పనిలో బిజీగా ఉండగా.. 'పుష్ప 3' కూడా రాబోతుందంటూ సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఆదరించడంతో 'పార్ట్ 2'తోనే సరిపెట్టకుండా 'పార్ట్ 3' కూడా తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే కథను కూడా రెడీ చేశాడని, అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందుంలో భాగంగానే రెండు పార్టులు తీయడానికి లోకేషన్స్ వెతుకుతున్నాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీ మొదటిపార్ట్‌లో అల్లు అర్జున్ సరసన రష్మిక నటించగా ఐటమ్ సాంగ్‌ చేసిన సమంత కుర్రాళ్లను ఊర్రూతలూగించింది.

Advertisement

Next Story