వనపర్తి జిల్లాకు స్టడీ సర్కిళ్లు మంజూరు..ప్రకటించిన మంత్రి

by Javid Pasha |
వనపర్తి జిల్లాకు స్టడీ సర్కిళ్లు మంజూరు..ప్రకటించిన మంత్రి
X

దిశ, వనపర్తి : వనపర్తి జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లు మంజూరయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. వనపర్తి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టడీ సర్కిళ్లను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్-4 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువత ఎస్టీలు studycircle.cgg.gov.in/tstw, ఎస్సీలు tsstudycircle.co.in, బీసీలు mjpabcwreis.cgg.gov.in లలో ధరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ శిక్షణ ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపికైన వారికి అత్యున్నత స్థాయి శిక్షణతో పాటు భోజన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. అనంతరం స్టడీ సర్కిళ్లను కేటాయించిన సీఎం కేసీఆర్ కు, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ లకు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed