ప్రియ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం.. కార్మికుడు మృతి

by Satheesh |
ప్రియ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం.. కార్మికుడు మృతి
X

దిశ, మేళ్లచెరువు: సుర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం, రామాపురం గ్రామంలోని ప్రియ (రైన్స్)సిమెంట్ పరిశ్రమలో గత నెల 31న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పవర్ ప్లాంట్‌లోని బాయిలర్‌లో ఓ భాగం అకస్మాత్తుగా తెరుచుకుని స్టీమ్ వాటర్ ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో అక్కడే పని చేస్తున్న రామాపురం గ్రామానికి చెందిన నిగిడాల శ్రీనివాస్‌పై(40)‌ బాయిలర్‌లోని వాటర్ మీద పడడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీనితో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్.. శనివారం మధ్యాహ్నం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మరణంతో అతడిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ దిక్కుతోచని స్థితిలో ఉంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మేళ్లచెరువు ఎస్సై రవీందర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed