- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారు.. భయమేస్తోంది : యంగ్ బ్యూటీ
దిశ, సినిమా : తెలుగు 'బిగ్‌బాస్' ప్రస్తుతం 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా చాలామంది కంటెస్టెంట్లు సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకుంటున్నారు. వారిలో చొక్కారపు స్రవంతి కూడా ఒకరు కాగా.. తను అంతకుముందే యూట్యూబ్ చానల్‌తో పాపులర్ అయింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేస్తున్న ఈ యాంకర్‌పై తాజాగా ఆమె భర్త ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్రవంతికి బిగ్‌బాస్ ఐదో సీజన్‌లోనే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్యం సహకరించక వెళ్లలేదని క్లారిటీ ఇచ్చాడు.
ఇక తను ఓ బిజినెస్ స్టార్ట్ చేసి నష్టపోయినట్లు వెల్లడించిన ప్రశాంత్.. అప్పటికే ఇద్దరం ప్రేమలో ఉన్నామని, అదే సమయంలో స్రవంతి ఫోన్ చేసి ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారని భయపడేదని తెలిపాడు. దీంతో తనను రహస్యంగా పెళ్లి చేసుకుని హాస్టల్‌లో ఉంచినట్లు గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత అందరినీ ఒప్పించి ఇరువురి కుటుంబాల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నాడు.