- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్..
దిశ, తెలంగాణ బ్యూరో : "ఉపోద్ఘాతం, ఉపన్యాసాలు వద్దు. ఇది అసెంబ్లీ మాత్రమే. అడగాలనుకున్నది సూటిగా ప్రశ్నించండి. సమయాన్నిదయచేసి వేస్ట్ చేయొద్దు" అంటూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డితొలిసారి డిఫరెంట్ స్టైల్ లో సంధించారు. అదీ అధికార పక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడటం తో అందరూ షాక్ కు గురయ్యారు. సోమవారం క్వశ్చన్అవర్షురూ కాగానే టీఆర్ఎస్ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం, సీఎం కేసీఆర్నాయకత్వం అంటూ పదే పదే పోల్చుతూ ప్రశ్నలు అడగకుండా సర్కార్ ను పొగిడే కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు. గతంలో చేయని పనులను టీఆర్ఎస్చేసిందని చెప్పుకుంటూ అధిక సమయాన్ని తీసుకున్నారు. స్పీకర్ మైక్ ఇవ్వగానే కేసీఆర్ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ లేని స్కీంలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి చేశామని పాత ముచట్లనే రిపీట్ చేశారు. పదే పదే సభ ఇదే విధానంలో వెళ్తుండటంతో స్పీకర్ విసిగిపోయారు. అవకాశం వచ్చిన ప్రతీ ఎమ్మెల్యే ఇదే దిశగా వ్యవహరిస్తుండగా, స్పీకర్ టీఆర్ఎస్ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాన్ని వృథా చేయడం సరైన విధానం కాదంటూ హితవు పలికారు. మరోవైపు ప్రశ్నలు అడిగిన వారిని స్పీకర్ ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం.