ఉపాధి హామీలో కోతలపై పార్లమెంటులో సోనియా మండిపాటు

by Harish |
ఉపాధి హామీలో కోతలపై పార్లమెంటులో సోనియా మండిపాటు
X

న్యూఢిల్లీ: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో కోతలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంటు సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తగిన కేటాయింపులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వానికి సహాయం చేసిన పథకానికి 15 రోజుల్లో చెల్లింపులు నిర్ధారించాలని తెలిపారు. దీనిపై గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ వాస్తవానికి దూరంగా సోనియా వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకానికి రూ.33,000 వేల కోట్ల కేటాయింపులు ఉన్నాయి. కానీ మోడీ ప్రధాని అయ్యాక రూ.1.12 లక్షల కోట్లకు చేరింది. మాకు ఎలాంటి అద్దం చూపించాల్సిన అవసరం లేదు అని అన్నారు.

ఈ పథకంలో ఇప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు ఉన్నాయని సోనియా ఆరోపించారు. 2020 తో పోలిస్తే 2021లో 35 శాతం తక్కువ కేటాయింపులు చేశారని తెలిపారు. నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు ఇలాంటివే ప్రస్తావనకు వస్తాయని అన్నారు. గతంలో ఈ పథకంలో చెల్లింపుల ఆలస్యాన్ని బలవంతపు పనులుగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ ఆడిట్ సమర్థవంతంగా ఉండాలి కానీ, డబ్బులు ఇవ్వకుండా కార్మికులను శిక్షించకూడదని అన్నారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఉపాధి హామీ పథకంలో అవినీతి ఎక్కువ జరిగిందని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో జియో ట్యాగింగ్ పరిచయం చేయడమే కాకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు పడేలా చేశామని చెప్పారు. మరోవైపు యూపీఏను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed