- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్టీ పునర్వైభవానికి ప్రయత్నిస్తున్నాం.. స్పష్టం చేసిన సోనియా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై జీ-23 సభ్యులకు సోనియా గాంధీ మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చారు. పార్టీ ఎంపీల వీక్లీ సమావేశంలో భాగంగా సోనియా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఇందులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ' కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల లీడర్లలో ఐక్యత అవసరం. ఐక్యంగా ఉంటేనే పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుంది. నాలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పుడు మీరెంత నిరాశకు లోనయ్యారో నాకు తెలుసు. నాయకత్వ మార్పునకు సంబంధించి, పార్టీ బలోపేతం కోసం మీరిచ్చిన సలహాలు, సూచనలను స్వీకరించాం. వాటిపైనే ప్రస్తుతం పనిచేస్తున్నాం' అని సోనియా చెప్పుకొచ్చారు.
ఇకపోతే నాయకత్వ మార్పునకు సంబంధించి జీ-23 రెబల్ ఎంపీలు చేసిన డిమాండ్ నేపథ్యంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పార్టీ నాయకత్వానికి రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధపడగా సీడబ్ల్యూసీ దానిని తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు ఎంపీలు నేటికి కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.