గుండె గుట్టు.. లెక్కగట్టు! జెనెటిక్ రిస్క్‌ను గుర్తించే యాప్

by Javid Pasha |
గుండె గుట్టు.. లెక్కగట్టు! జెనెటిక్ రిస్క్‌ను గుర్తించే యాప్
X

దిశ, ఫీచర్స్ : అమెరికన్ 'స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషనల్ ఇన్‌స్టిట్యూట్' శాస్త్రవేత్తలు 'మై జీన్ ర్యాంక్(MyGeneRank)' పేరుతో కొత్త యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ కరోనరీ ఆర్టరీ వ్యాధికి సంబంధించి వ్యక్తి జన్యుపరమైన ప్రమాదాన్ని లెక్కగట్టడంతో పాటు అధిక ప్రమాద తీవ్రత ఉన్న వారికి తగిన వైద్య సలహాలను అందజేస్తుంది. ఇండియాలో కరోనరీ ఆర్టరీ వ్యాధి(CAD)తో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 4.5 మిలియన్లు. అమెరికాలో ఈ సంఖ్య 20 మిలియన్.

అయితే దీని వల్ల మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వారిలో మూడింట ఒక వంతు మాత్రమే తగిన మందులు తీసుకుంటున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. 'సీఏడీ' వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఎక్కువ కాబట్టి రోగులను గుర్తించడంలో జెనెటిక్ రిస్క్ స్కోర్(జన్యు ప్రమాద స్కోర్) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో అధిక ప్రమాదమున్న రోగులను తగిన సమయంలో క్లినికల్ కేర్‌కు మళ్లించడంలో 'మై జీన్ ర్యాంక్' యాప్ ప్రభావాన్ని చూపనుంది. ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్.. ముందుగా సదరు వ్యక్తుల నుంచి పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌ను గణిస్తుంది.

అనేక ఆరోగ్య సర్వేలను పూర్తి చేసిన తర్వాత యూజర్లకు CAD జెనెటిక్ రిస్క్ స్కోర్‌తో పాటు జీవనశైలి మార్పులు, జన్యు సలహాలు అందించబడతాయి. ఈ మేరకు 721 మంది ప్రారంభ యూజర్లపై చేపట్టిన అధ్యయన ఫలితాలను పరిశోధకులు పరిశీలించారు. ఇందులో CAD జన్యు ప్రమాద స్కోర్స్ పొందినవారు స్టాటిన్స్ లేదా ఇతర కొలెస్ట్రాల్‌ను తగ్గించే చికిత్సలు ప్రారంభించే అవకాశం రెండింతలు ఉన్నట్లు కనుగొన్నారు.

Advertisement

Next Story

Most Viewed