Monkeypox : భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు.. అప్రమత్తమైన ప్రభుత్వం

by Harish |   ( Updated:2022-07-18 12:13:39.0  )
Second Monkeypox Case in India Reported From Kerala
X

తిరువనంతపురం: Second Monkeypox Case in India Reported From Kerala| భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ వచ్చింది. ఈ వ్యక్తి కూడా మే 13వ తేదీన దుబాయ్ నుంచి కేరళకు వచ్చాడు. అయితే చాలా రోజుల తర్వాత ఇతడికి మంకీ పాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు.. సోమవారం పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా, జులై 14వ తేదీన దేశంలోనే మొదటి మంకీ పాక్స్ కేసు కేరళలోని కొల్లామ్ జిల్లాలో నమోదైంది. వరుస కేసుల నమోదుతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడి చేయడానికి, విదేశీ ప్రయాణికులను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

ఇది కూడా చదవండి: తమిళనాడులో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

Next Story

Most Viewed