- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాభివృద్ధికి పెద్దపీట.. అన్ని కులాల అభివృద్ధికి కృషిచేస్తాం: చిట్కుల్ సర్పంచ్
దిశ, పటాన్ చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తన స్వంత నిధులతో నిర్మించనున్న ముదిరాజ్ భవన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి తాను కట్టుబడి పని చేస్తున్నాని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ముదిరాజ్ భవన్ అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా శుభకార్యాలకు అనువుగా ఉండేవిధంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దశలవారీగా అన్ని కులాల అభివృద్ధికి కృషిచేస్తానని అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత ముందజలో నిలిపేవిధంగా అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆంజనేయులు, మన్నే వెంకటేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీను, లక్ష్మయ్య, వీరస్వామి, నగేష్, వెంకటేష్, హనుమంత్, లింగం, రవీందర్, వెంకటేష్, అంజి, వీరస్వామి, విష్ణు, జంగన్న, శేఖర్, శ్రీను, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.