పిచ్చిగా కామెంట్ చేయడం మానుకోండి..: Sameera Reddy

by Manoj |   ( Updated:2022-03-31 08:22:32.0  )
పిచ్చిగా కామెంట్ చేయడం మానుకోండి..: Sameera Reddy
X

దిశ, సినిమా: ఇటీవల 'ఆస్కార్‌' అవార్డుల ప్రధానోత్సవంలో హాలీవుడ్ హీరో విల్‌స్మిత్‌ కమేడియన్ క్రిస్‌ రాక్‌ చెంప పగలగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు రకరకాలుగా స్పందిస్తుండగా తాజాగా నటి సమీరా రెడ్డి తనదైన శైలిలో రియాక్ట్ అయింది. ఈ మేరకు తాను కూడా స్మిత్‌ భార్యలాగే అలోపేసియా ఏరియాటా సమస్యతో బాధపడినట్లు చెబుతూ జీవితంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారని తెలిపింది.

ఈ క్రమంలోనే కొంతమంది వాటిని అర్థం చేసుకోకుండా పిచ్చిగా కామెంట్ చేస్తూ మానసికంగా వేదిస్తారన్న ఆమె.. '2016లో నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను. నా తల వెనక భాగంలో 2 ఇంచుల మేర జుట్టు ఉడిపోయింది. అయితే అందరూ అనుకున్నట్లు ఇదేం అంటువ్యాధి కాదు. ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. జుట్టు రాలిపోవడం మానసిక ఆరోగ్యంపై కొద్దిగా ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ.. కాంట్రవర్సీలు చేసేవారివల్ల మరింతబాధ అనుభవించాల్సి వస్తుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సమీరా స్మిత్ భార్యకు మద్ధతుగా నిలుస్తున్నట్లు చెప్పింది.

Advertisement

Next Story