- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: నేను చెత్త నటిని ఇప్పటికీ అలాగే ఉన్నా.. సమంత షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత ఏడాది మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరం అయింది. మళ్లీ ఏడాది తర్వాత ఈ అమ్మడు ‘సిటాడెల్: హనీ, బన్నీ’ (Citadel: Honey, Bunny)వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటిస్తుండగా.. రాజ్, డీకే(Raj, DK) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో.. అక్టోబర్ సిటాడెల్(Citadel: Honey, Bunny) ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఇందులో స్పై ఏజెంట్‌గా నటించిన సామ్ యాక్షన్స్ స్టంట్స్ బాగా చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత(Samantha) షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నా మొదటి సినిమా ఏ మాయ చేశావే సమయంలో జరిగిన ఆడిషన్స్, ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey, Bunny) కోసం జరిగిన వాటికి చాలా తేడా ఉంది. ఈ వెబ్‌సిరీస్‌లో చెత్తనటిగా నటించడం రాని అమ్మాయిగా నటించాలి అని మేకర్స్ చెప్పారు. నేను ఆ ఆడిషన్ బాగా ఇచ్చాను. ఆ సీన్స్ బాగా చేశాను ఎందుకంటే నేను సగం చెత్తనటినే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను అని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే నేను ఏ సినిమా కోసం అయినా నా బెస్ట్ ఇచ్చానంటే మొత్తం క్రెడిట్ నాది కాదు. సరైన టీమ్ ఉన్నప్పుడే మనలోని మంచి నటన బయటకు వస్తుంది. ఏ సీన్ అయినా అవలీలగా చేయగలం. కాబట్టి నేను క్రెడిట్ అంతా నాకు మాత్రమే సొంతం అనుకోను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సామ్ ఇతరుల శ్రమను కూడా గుర్తించడం గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు.