భయంకరమైన ఎన్‌కౌంటర్.. కోమాలోకి వెళ్లిన స్టార్ నటి

by Manoj |
భయంకరమైన ఎన్‌కౌంటర్.. కోమాలోకి వెళ్లిన స్టార్ నటి
X

దిశ, సినిమా: అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామాగా తెరకెక్కిన టెలివిజన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో కూడిన నాల్గో సీజన్.. జూలై 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. కాగా ఇందులో ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత కోమాలోకి వెళ్లిన నటి సాడీ సింక్.. త్వరలో రాబోయే 5వ సీజన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ మేరకు 'నెక్ట్స్ సీజన్‌లో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మీరు ప్రాణాలతో తిరిగోస్తారా? మరణిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. నిజంగా ఐదవ సీజన్‌లో ఏమి జరగబోతోందో నాకు కూడా తెలియదు. కానీ, రాబోయే సీజన్‌ మరింత ఉత్కంఠగా ఉంటుంది. ఒక స్క్రిప్ట్‌లో సహ నటుడు మాక్స్ చనిపోతాడని మాత్రం అర్థమైంది. షూటింగ్ మొదలయ్యే వరకూ మేకర్స్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్క్రిప్ట్‌ను చాలా రహస్యంగా ఉంచుతున్నారు' అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed