- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరసన చేస్తాం.. కానీ సమ్మెలో పాల్గొనలేం: ఆర్టీసీ కార్మికులు
దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనకుండా నిరసన తెలుపుతామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రకటించింది. ఆర్టీసీ సంస్థ ఇప్పటికే నష్టాల్లో ఉందని, సార్వత్రిక సమ్మెలో కూడా సింగరేణి, ఆర్టీసీకి మినహాయింపు ఇచ్చారని, ఈ నేపథ్యంలో కార్మికులకు మళ్లీ వేతన కష్టాలు రాకుండా విధులకు హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నామని టీఎంయూ అధ్యక్షుడు కమలాకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. విధులకు హాజరైన కార్మికులు నిరసన తెలిపే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, వీటిని అందరూ ఖండిచాల్సిందేనన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణకు తలపెట్టిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజా రవాణా బిల్లు ఆర్టీసీకి గొడ్డలిపెట్టు అని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీకి బల్క్ డీజిల్‌పై సబ్సిడీని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉందని, గాడిలో పెట్టేందుకు సీఎం, ఆర్టీసీ చైర్మన్, ఎండీ కృషి చేస్తున్నారని, సమ్మెలో పాల్గొంటే నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. దానిలో భాగంగానే సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరుకావాలని, నిరసన తెలుపాలని కమలాకర్‌గౌడ్, థామస్‌రెడ్డి కోరారు.