- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆడవాళ్ల నగ్నత్వమే ఆస్వాదిస్తారా? మగాళ్లను ఎంకరేజ్ చేయమంటున్న నటి

దిశ, సినిమా: ప్రముఖ నటి రోజ్లిన్ ఖాన్ రణ్‌వీర్ సింగ్ నగ్న చిత్రాలను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపింది. గతంలో పెటా ప్రచారం కోసం 'బ్లడ్ బాత్' ఫొటోషూట్‌తో దేశవ్యాప్తంగా వైరల్ అయిన రోజ్లిన్.. 'ఇలాంటి గొప్ప పనులు చేయాలంటే గట్స్ ఉండాలి. ఒకప్పుడు జనాలు వీటిపై వివాదాలు సృష్టించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీని వెనుకున్న ఆలోచన, సందేశాన్ని ప్రజలు ఓపెన్ మైండ్‌తో అర్థం చేసుకుంటున్నారు. అందుకే రణ్‌వీర్ సౌకర్యంగా ఫీలయ్యాడు. అతనొక కళాకారుడు. ఆయన ప్రతిభను గౌరవించాలి. ఇది హాలీవుడ్‌లో కొత్తేమీ కాకపోయినా భారత ప్రేక్షకులు ఇలాంటివి జీర్ణించుకోవడం అనుకున్నంత సులభం కాదు' అని చెప్పుకొచ్చింది. అలాగే ఒక మహిళా బోల్డ్ క్యారెక్టర్ కోసం స్కిన్ షో చేస్తే మరింత కావాలని ఆశించే ప్రేక్షకులున్న సమాజంలో పురుషులకు మాత్రం హద్దులు పెట్టడం శోచనీయమని కౌంటర్ వేసింది రోజ్లిన్.