ప్రభుత్వ ఆఫీసుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రించండి: హైకోర్టు ఆదేశాలు

by Harish |
ప్రభుత్వ ఆఫీసుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రించండి: హైకోర్టు ఆదేశాలు
X

చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఫోన్లు వాడటం వల్ల కార్యనిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఓ వ్యక్తి అతిగా మొబైల్ వాడుతున్నారనే కారణంతో తనను సస్పెండ్ చేశారని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. 'ఆఫీసుల్లో ఫోన్ వినియోగం ఇతర కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకోవాలి. అత్యవసరమైతే కాల్స్ మాట్లాడాలి. లేదంటే సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో ఉంచాలి. వీలైతే స్విచాఫ్ చేయాలి' అని కోర్టు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

Next Story