- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Realme 9 నుంచి 5G సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్‌లు
దిశ, వెబ్‌డెస్క్: Realme నుంచి రెండు స్మార్ట్ ఫోన్‌లు విడుదలయ్యాయి. Realme 9 5G, Realme 9 5G SE ఫోన్‌లు గురువారం భారత్‌లో లాంచ్ అయ్యయి. స్మార్ట్‌ఫోన్‌లు 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలతో 128GB వరకు మెమరీని అందిస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా 5,000mAh బ్యాటరీతో వస్తున్నాయి.
Realme 9 5G స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ 11, Realme UI 2.0 పై పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల పూర్తి-HD+ (1080x2400 పిక్సెల్) డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో, 600 నిట్‌లను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 810 SoC ద్వారా 6GB వరకు LPDDR4X RAM తో వస్తుంది. స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రైమరీ కెమెరా, 2MP B&W కెమెరా, 2MP మాక్రో కెమెరాను అమర్చారు. ఫోన్ ముందు భాగంలో, సెల్ఫీల కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 14,999. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 17,499. ICICI బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ మెటోర్ బ్లాక్, స్టార్‌గేజ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Realme 9 5Gలోని సెన్సార్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. Realme 9 5G USB టైప్-C పోర్ట్‌లో 18W క్విక్ చార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
Realme 9 5G SE స్పెసిఫికేషన్లు
Realme 9 5G SE కూడా ఆండ్రాయిడ్ 11, Realme UI 2.0 పై పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,412 పిక్సెల్‌లు) డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌లను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా 8GB RAMతో వస్తుంది. స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రైమరీ కెమెరా, 2MP B&W కెమెరా, 2MP మాక్రో కెమెరాను అమర్చారు. ఫోన్ ముందు భాగంలో, సెల్ఫీల కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
Realme 9 5G SE 128GB మెమరీని మైక్రో SD కార్డు ద్వారా (1TB వరకు) విస్తరించవచ్చు. హ్యాండ్‌సెట్‌లోని సెన్సార్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇది USB టైప్-C పోర్ట్, 30W క్విక్ చార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 19,999. 8GB + 128GB ధర రూ. 22,999. ICICI బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2,000 ఆఫర్ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ అజూర్ గ్లో, స్టార్రీ గ్లో కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. రెండు ఫోన్‌లు కూడా మార్చి 14 నుండి Flipkart, Realme.com రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.