టాప్ పొజిషన్ చేరుకోవడానికి అందరితో పడుకోవాలా?.. రష్మి గౌతమ్

by Harish |
టాప్ పొజిషన్ చేరుకోవడానికి అందరితో పడుకోవాలా?.. రష్మి గౌతమ్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి, యాంకర్ రష్మి గౌతమ్ కొంత గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 'డిజే టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో 'గుంటూర్ టాకీస్' మూవీలో రచ్చ చేసిన రష్మి.. ప్రస్తుతం 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుంటే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉండే రష్మి.. జంతువుల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఇతరత్ర ఇష్యూస్‌పై కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అసభ్యకరమైన ఓ మీమ్‌పై చాలా సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఇంతకు ఆ మీమ్ ఏమిటంటే.. 'టాప్ పొజిషన్‏కు చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుంది' అని ఓ ప్రముఖ నటి ఫేస్‌ పెట్టి ఈ పదాలు రాసుకొచ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా ఒక్కసారిగా షాక్ అయిన రష్మి.. 'అందరూ తేలికగా ఆ మాటలను అనేస్తుంటారు. కానీ, మా కష్టాలేంటో తెలియకుండా ఇలా మాట్లాడటం బాధ్యతలేని వాళ్లకే చెల్లుతుంది' అంటూ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.

Advertisement

Next Story