ఈ నెల 14 న రణబీర్, అలియా వివాహం..?

by Mahesh |
ఈ నెల 14 న రణబీర్, అలియా వివాహం..?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్స్ రణబీర్, అలియా భట్ వివాహం చేసుకోబోతున్నట్లు వస్తున్న పుకార్లకు.. తెర పడింది. కొంత కాలంగా ఏప్రిల్ లోనే వారి పెళ్లి చేసుకుంటారని. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన అలియా బాబాయ్ రాబిన్ మహేష్ భట్ అలియా మెహందీ ఫంక్షన్ ఏప్రిల్ 13న జరుగుతుందని ఓ మీడియా సంస్థకు చెప్పారు. అయితే మెహందీ ఫంక్షన్ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 14న అలియా, రణబీర్ వివాహం జరుగనున్నది. వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల నడుమ జరుగుతున్నట్లు దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story