'RRR'ను తక్కువ చేసి మాట్లాడిన కేఏ పాల్.. కౌంటర్ ఇచ్చిన RGV

by Manoj |
RRRను తక్కువ చేసి మాట్లాడిన కేఏ పాల్.. కౌంటర్ ఇచ్చిన RGV
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సువార్తకుడు, శాంతి సృష్టికర్తగా పేరుగాంచిన మానవతావాది KA పాల్ అందరికీ సుపరిచితమే. ఆయన నిజాయితీని కొందరు మెచ్చుకుంటే, మరికొందరు లైట్‌ తీసుకుంటారు. తాజాగా.. పాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లైవ్ సెషన్ చేశాడు. ఇందులో అతని అభిమానులు అనేక విషయాలపై ప్రశ్నలు అడిగారు.

రాజ్‌మౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం చూశారా? అని ఒక వ్యక్తి పాల్‌ని అడిగాడు. పాల్ వెంటనే, "ప్రతిరోజూ ఒక కొత్త సినిమా వస్తుంది. ఇవన్నీ ఎవరు గుర్తుంచుకుంటారు? RRR గురించి ఎప్పుడూ వినలేదు. మీకు వేరే పని లేదా? మీరు విడుదలైన ప్రతి సినిమా చూస్తారా?". సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని పాల్ ప్రబోధించాడు. "ఉపయోగకరమైన దాని కోసం పని చేయండి. ఈసారి రాజకీయాలను సరికొత్తగా, కుల వివక్ష రహితంగా మార్చేందుకు మనమందరం కష్టపడాలి' అని ఆయన అన్నారు.

'RRR' గురించి ప్రశ్నలు అడగడంపై క్లాస్ తీసుకుంటూ, KA పాల్ మాట్లాడుతూ "ఎవరో సినిమా తీస్తారు. దాని కోసం మీ సమయం వృథా.. మీరు దాని నుండి మంచి ఏమీ పొందలేరు. కనీసం అర్థవంతమైన సినిమాలైనా చూడండి. నేను RRR సినిమా గురించి ఎప్పుడూ వినలేదు.. అది ఏమిటో నాకు తెలియదు. తెలుగు మేకర్స్ ప్రతి వారం రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు అని వ్యంగ్యంగా నవ్వుతూ టాపిక్ ముగించాడు.

అనంతరం ఏప్రిల్ 9 లోపు తాను భారతదేశానికి వస్తానని చెప్పాడు. పాల్ సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడతాడు. అతను సినిమాపై స్పదించిన వాటిల్లో ఇది ఒకటి. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ను తక్కువ చేసి చూపినందుకు నెటిజన్లు అతనిపై ఫైర్ అయ్యారు. ఇంతలో, RGV పాల్‌కి "నీ మొహమ్ రా" అనే ట్వీట్‌తో సమాధానం ఇచ్చాడు.

Advertisement

Next Story