RRR సక్సెస్‌ ఊహించలేదు.. Ram Charan

by Manoj |   ( Updated:2022-04-05 08:13:57.0  )
RRR సక్సెస్‌ ఊహించలేదు.. Ram Charan
X

దిశ, సినిమా : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మూవీ రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అల్లూరి, కొమురం భీమ్‌గా రాంచరణ్, ఎన్టీఆర్‌ల నటనకు యావత్ దేశం ఫిదా అవుతోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా.. చెర్రీ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుసు గానీ ఫస్ట్ వీక్‌లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'నంబర్ 1' ట్యాగ్ సాధిస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో తారక్‌తో పాటు దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళితో కలిసి పనిచేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక తారక్‌తో తనకు ప్రొఫెషనల్‌గా పోటీ ఉందే తప్ప వ్యక్తిగతంగా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. కాగా 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలైన మొదటి 10 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 900 కోట్ల మార్కును అధిగమించి, ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ చిత్రంగా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed