Vettaiyan OTT : ఓటీటీలోకి సూపర్ స్టార్ ‘వేట్టయన్’.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?

by sudharani |   ( Updated:2024-10-29 15:55:39.0  )
Vettaiyan OTT :  ఓటీటీలోకి సూపర్ స్టార్ ‘వేట్టయన్’.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ (Vettayan- The Hunter). టి.జె.జ్ఞాన‌వేల్ (TJ Gnanvale) ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ.. సూపర్ స్టార్ కెరీర్‌లో 170వ చిత్రంగా వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ (Lyca Productions) నిర్మించిన ఇందులో బాలీవుడ్ (Bollywood) మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చన్ కీలక పాత్రలో కనిపించగా.. మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్‌ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టించి మెప్పించారు. భారీ అంచనాల మధ్య ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ (October) 10న త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా (Pan India) చిత్రం మిక్సిడ్ టాక్ సొంతం చేసున్నప్పటికీ.. బాక్సాఫీస్ (box office) వద్ద కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది.

ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ‘వేట్టయన్- ద హంటర్’ ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (Digital Streaming) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సొంతం చేసుకోగా.. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ (streaming) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.

Advertisement

Next Story