- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajasthan Royals: రాజస్థాన్‌కు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికీ ఆల్‌రౌండర్ అవుట్
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లల్లో భారీ విజయాలను సాధించింది. తాజాగా ముంబై వాంఖెడె స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. విజయం కోసం తీవ్రంగా పోరాడింది. వరుస విజయాలతో దూకుడుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ నాథన్ కౌల్టర్ నీల్ జట్టుకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. నాథన్ సిరీస్ మొత్తానికీ అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. స్పీడీ రికవరీ అనే క్యాప్షన్‌నుతో అధికారిక ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
నాథన్ కౌల్టర్ నీల్ తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. ఆ తరువాత గాయం వల్ల జట్టుకు దూరం అయ్యాడు. అతని స్థానాన్ని మరో ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ భర్తీ చేశాడు. నాథన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని తేలడంతో.. స్వదేశానికి తిరుగుముఖం పట్టనున్నాడు.
Until we meet again, NCN. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2022
Speedy recovery. 🤗#RoyalsFamily | #HallaBol | @coulta13 pic.twitter.com/XlcFUcTg5L