Raj Tarun: రాజ్ తరుణ్ రూటు మార్చేశాడుగా.. ఈ సారైనా కలిసొచ్చేనా?

by Prasanna |
Raj Tarun: రాజ్ తరుణ్ రూటు మార్చేశాడుగా.. ఈ సారైనా కలిసొచ్చేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆహా ఓటీటీ సంస్థ ఎప్పుడూ కొత్త కథలను తీసుకొస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా, ఒక సిరీస్ ను మన ముందుకు తీసుకురానుంది. చిరంజీవ పేరుతో ఈ సిరీస్ రానుంది. మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ తో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబందించిన లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

జబర్దస్త్ లో తనదైన కామెడీతో మంచి పేరు తెచ్చుకున్న అభినయ కృష్ణ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సిరీస్ లో హీరో ని రివీల్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇక వీడియోలో డైరెక్టర్ అభినయ కృష్ణ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి కూర్చొని.. ఈ కథ సూపర్ గా ఉంటుందని .. పక్కా ఇండియన్ స్టైల్ లో ఇది ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో ఎవరూ సిరీస్ తీయలేదని తెలిపాడు. త్వరలోనే దీనికి సంబందించిన టీజర్ కూడా రాబోతుందని తెలిపాడు. కాగా, ఈ సిరీస్ జనవరిలో రానుంది.

ఈ సిరీస్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడంటూ క్లారిటీ ఇచ్చాడు. తెలుగులో రాజ్ త‌రుణ్ న‌టిస్తోన్న రెండో వెబ్ సిరీస్ ఇది. మరి, ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story