Prashant Varma: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-11-03 14:11:47.0  )
Prashant Varma: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’(Hanuman) బ్లాక్ బస్టర్ హిట్‌ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’(Jai Hanuman) రాబోతున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ(Prashanth Verma) ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినీ ప్రేక్షకులు ‘జై హనుమాన్’ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా, ప్రశాంత్ వర్మ దీపావళి సందర్భంగా ‘జై హనుమాన్’(Jai Hanuman) అప్డేట్ రాబోతున్నట్లు పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) రేపు అక్టోబర్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఓ ప్రీ లుక్ పోస్టర్‌(Pre Look Poster)ను కూడా షేర్ చేశారు. ఇందులో హనుమంతుడు ఓ పురాతన దేవాలయం వైపు నడుచుకుంటూ వెలుతున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను నెట్టింట పెట్టారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click Here For Twitter Post..

Advertisement

Next Story