- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: దమ్ముంటే పార్టీ అధ్యక్షుడిగా ఓ ముస్లింను చేయండి.. కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ సంచలన సవాల్

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) జయంతి రోజున ప్రతిపక్ష కాంగ్రెస్ (Congres)పై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హర్యానా (Haryana) రాష్ట్రంలోని హిస్సార్ (Hassar)లో పర్యటిస్తున్న ఆయన ఓ బహిరంగ సభకు హాజరై మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టాన్ని (Waqf Amendment Act) వ్యతిరేకించడం ద్వారా హస్తం పార్టీ అంబేద్కర్ మరోసారి అవమానించిందని ఫైర్ అయ్యారు. ఏళ్లుగా అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారత రాజ్యాంగాన్ని కాలరాసిందని ధ్వజమెత్తారు.
ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకించామని కాంగ్రెస్ అంటోందని.. ఒక వేళ ఆ పార్టీకి ముస్లింలపై దయే ఉంటే.. తమ పార్టీ అధ్యక్షుడిగా ఓ ముస్లింను నియమించాలని సవాల్ విసిరారు. అదేవిధంగా కాంగ్రెస్ 50 శాతం టికెట్లను ముస్లింలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న ఏనాడు ముస్లింలకు కాంగ్రెస్ ఏం చేయలేదని.. భవిష్యత్తులో కూడా ఏం చేయబోదని కామెంట్ చేశారు. నిరుపేదలకు సామాజిక న్యాయం చేయాలనే లక్ష్యంతో తమ సర్కార్ పని చేస్తోందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసమే గతంలో కాంగ్రెస్ వక్ఫ్ నిబంధనలు మార్చిందని, రాజ్యాంగం కన్నా.. వక్ఫ్‌నే పెద్దదిగా ఆ పార్టీ చేసి చూపిందని ప్రధాని మోడీ ఆరోపించారు.
వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు జరగుతుందని అన్నారు. పేదల నుంచి భూ మాఫియా చేస్తున్న లూఠీని వక్ఫ్ సవరణ చట్టం అడ్డుకుంటందని వివరించారు. వేల మంది వితంతు ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి తరువాతే.. వక్ఫ్ చట్టానికి సవరణ తీసుకొచ్చిమని పేర్కొన్నారు. వక్ఫ్ ప్రాపర్టీల వల్ల పిడికెడ్ భూ మాఫియాకు మేలు జరిగిందని, దేశ వ్యాప్తంగా లక్షలాది హెక్లార్ల భూమి వక్ఫ్ పేరు మీద ఉందని అన్నారు. ఆ భూముల ద్వారా ముస్లింలలో పేదలు, మహిళలకు మేలు జగాల్సి ఉండేదని తెలిపారు. ప్రస్తుత చట్టంతో ఇప్పుడు చిక్కులు విడిపోయాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.