- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవెంట్స్‌కు తాత్కాలిక బ్రేక్.. ససేమిరా అంటున్న పోలీసులు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్పెషల్ ఈవెంట్స్‌కు బ్రేక్ పడింది. రేవ్ పార్టీలు, పబ్‌లు, స్పెషల్ ఈవెంట్స్ సమయాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారనే కారణాలతో వాటన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. స్పెషల్ ఈవెంట్స్‌కు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇటీవల రాడిసన్ హోటల్లోని పుడింగ్ మింక్ పబ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీనిపై విచారణ సాగుతోంది. పబ్బుల్లో పుట్టినరోజు వేడుకలు, వీకెండ్లలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక నుంచి వీకెండ్ పార్టీలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు.
తాత్కాలికంగా ఈవెంట్స్ వద్దంటూ పోలీసులు పలు దరఖాస్తులను తిరస్కరించారు. మరోవైపు అబ్కారీ శాఖ కూడా డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి పెట్టింది. వీకెండ్లో ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలోని పబ్‌లు, బార్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో వీకెండ్స్‌లో గస్తీ నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే గస్తీ తిరగడం మొదలుపెట్టారు.