- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు పూణే మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రతిష్టాత్మక పూణే మెట్రోను ప్రారంభించనున్నారు. రూ.11,400 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన కూడా ప్రధాని చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు.
ఈ ప్రాజెక్ట్ పూణేలో అర్బన్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించే ప్రయత్నం' అని పేర్కొంది. మొత్తం 32.2 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గంలో ముందుగా 12 కిలోమీటర్లను ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభం కూడా చేయనున్నారు. వీటిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ, మూల-ముఠా నది ప్రాజెక్టులు పునరుజ్జీవనానికి శంకుస్థాపనతో పాటు 100 ఎలక్ట్రానిక్ బస్సుల ప్రారంభోత్సవం ఉన్నాయి.