పెట్రో మంట.. ఏకంగా వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి... వీడియో వైరల్

by S Gopi |   ( Updated:2022-03-30 09:10:50.0  )
పెట్రో మంట.. ఏకంగా వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి... వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన వాహనాన్ని పక్కన పెట్టి గుర్రాన్ని కొనుక్కుని వార్తల్లో నిలిచాడు. తాజాగా ఇలాగే మరో వ్యక్తి కూడా బంకులోకి వాటర్ ట్యాంక్ ను తీసుకొచ్చి ఒకేసారి పెట్రోల్ ను కొని వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ వీడియా తెగ వైరల్ అవుతోంది. రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతుండడంతో భవిష్యత్తులో పెట్రోల్ రేట్లు ఇంకా పెరుగుతాయన్న భయంతో ఓ వ్యక్తి నేరుగా పెట్రోల్ బంక్ లోకి వాటర్ ట్యాంక్ ను తీసుకొచ్చాడు. అనంతరం దాని నిండా పెట్రోల్ ను కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story

Most Viewed