- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒవైసీ, మాయావతి పద్మవిభూషణ్ లేదా భారతరత్న: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయానికి ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీఎస్పీ నేత మాయావతి పరోక్షంగా కారణంగా అయ్యారని విమర్శించారు. వీరి భాగస్వామ్యానికి పద్మవిభూషణ్ లేదా భారత రత్న ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. 'బీజేపీ గొప్ప విజయాన్ని సాధించింది. అయితే, క్రితం సారితో పోలిస్తే అఖిలేష్ యాదవ్ మూడు రెట్ల సీట్లు గెలుపొందాడు. మాయావతి, ఒవైసీలు ఇద్దరు బీజేపీ విజయంలో పాత్ర వహించారు. అందుచేత వీరికి పద్మవిభూషణ్ లేదా భారత రత్న ఇవ్వాలి' అని జాతీయ మీడియాకు తెలిపారు. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించినప్పటికీ, పార్టీ ముఖ్య నేతలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని, గోవా ఉప ముఖ్యమంత్రులు ఓటమే అందుకు నిదర్శమని అన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు పంజాబ్‌లో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఘోర పరాజయం పాలయ్యారని తెలిపారు. అయితే పంజాబ్‌లో బీజేపీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయని వెల్లడించారు.