- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Telangana: అధికార పార్టీ ఎంపీటిసీలకే ఆ నిధులా..?

X
దిశ, రామడుగు: కేంద్ర ప్రభుత్వం ఎంపీటీసీలకు ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులను కేటాయించినప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార పార్టీ ఎంపీటీసీలకే నిధులు కేటాయిస్తున్నారని ప్రతిపక్ష ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంపీటీసీల పట్ల ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ.. రామడుగు మండలంలోని శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష ఎంపీటీసీలు ప్లకార్డులతో పోడియం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. గ్రామాల్లో వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు పనులు చేయకపోవడంతో ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సారించి తమకు నిధులు కేటాయించాలని చెప్పి, సభను బహిష్కరించారు.
Next Story