'విక్రమ్ గౌడ్' నుంచి న్యూ పోస్టర్.. రగ్డ్ లుక్‌లో కిరణ్ రాజ్

by S Gopi |   ( Updated:2022-07-05 14:49:06.0  )
విక్రమ్ గౌడ్ నుంచి న్యూ పోస్టర్.. రగ్డ్ లుక్‌లో కిరణ్ రాజ్
X

దిశ, సినిమా: కన్నడ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలతో సక్సెస్ వైపుగా దూసుకుపోతున్న హీరో కిరణ్ రాజ్.. ప్రస్తుతం 'విక్రమ్ గౌడ్' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దీపికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే జూలై 5 కిరణ్ రాజ్ బర్త్‌డే సందర్భంగా 'విక్రమ్ గౌడ్' చిత్రం నుంచి వావ్ అనిపించే పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కిరణ్ ఫుల్ రగ్డ్ లుక్‌లో కనిపించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్‌ను నింపాయి. ఇక పోసాని కృష్ణ మురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా.. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. మంత్ర ఆనంద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Next Story